పాలమూరు : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ ద్వారకాయి సాయిబాబా మందిరంలో ఈనెల 9వ తేదీన స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆషాడ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురుపూర్ణిమ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయిబాబాకు, అమ్మవారిని అభిషేక ప్రత్యేక అలంకరణ చేయనున్నారు.
అలాగే కాగడ హారతి, సకల దేవతా సహిత మృత్యుంజయ హోమం, సంధ్యా హారతి, అష్టోత్తర శతక్షీర కుంభాభిషేకం, సామూహిక సాయి వ్రతాలు, సకల దేవతా హోమం వంటి వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా కృపకు పాత్రులు కాగలరని కోరారు.