ఆర్మూర్ : హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు గల్ఫ్ కార్మికులు మద్దతు ప్రకటించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన తెలంగాణకు చెందిన గల్ఫ్కార్మికులు ఆర్మూర్ టీఆర్ఎస్ నాయకులు కోటపాటి నర్సింహానాయుడు ఆధ్వర్యంలో సింగాపూర్‌లోని కిట్స్ కాలేజీలో సుమారు 100 మందితో సమావేశమై గెల్లు శ్రీనివాస్ కు మద్దతుగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కెప్టెన్ లక్ష్మీకాంత్‌రావు, మంత్రి హరీష్‌రావుల ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ బుధవారం ప్రచారం నిర్వహించారు. అనంతరం గల్ఫ్కార్మికులు తమ సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరుతూ మంత్రి హరీశ్‌రావుకు వినతి పత్రం సమర్పించారు.
గల్ఫ్‌కార్మికుల కోసం రూ. 500 కోట్ల బడ్జెట్ ఏర్పర్చి ప్రత్యేక బోర్డు ద్వారా తిరిగి వచ్చిన కార్మికులకు ఉపాధి కల్పించాలని, గల్ఫ్‌లో మృతి చెందిన వారికి రూ. 5 లక్షల చెల్లించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆర్మూర్ మండల నాయకులు శంకర్, సంజీవ్‌రెడ్డి, వీరయ్య, అనంతరాజు, సతీశ్ గౌడ్, రాజయ్య, మల్లేశ్ రవి, పాపయ్యగౌడ్, బాలకృష్ణ, రఫీ, కుమారస్వామి, బాలరాజు, మల్లేశం, రవీందర్, రమేశ్, కుమారస్వామి, అశోక్, సురేశ్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.