న్యూఢిల్లీ: కెనడా నుంచి యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ చలికి గడ్డ కట్టి గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం మృతి చెందిన కేసులో ఇద్దరికి బుధవారం అమెరికా న్యాయస్థానం శిక్షను ఖరారుచేసింది. భారత్ నుంచి పలువురిని స్టూడెంట్ వీసాపై కెనడాకు రప్పించి, అక్కడి నుంచి అమెరికాకు అక్రమ మార్గంలో తరలిస్తున్న ఈ ముఠా గుట్టురట్టయ్యింది.
ఈ కేసులో భారత్‌కు చెందిన స్మగ్లర్ ‘డర్టీ హ్యారీ’ అని పిలువబడే హర్షకుమార్ రమణ్‌లాల్ పటేల్‌కు పదేండ్ల జైలు, ఆయన సహచరుడు ఫ్లోరిడాకు చెందిన స్టీవ్ ఆంటోనీ షాంద్కు ఆరేండ్ల శిక్షను ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2021లో కెనడా నుంచి యూఎస్‌కు వెళ్తుండగా గుజరాత్‌కు చెందిన జగదీశ్ పటేల్(39), వైశాలిబెన్(30), విహంగి(11), ధార్మిక్(3) చలికి తాళలేక మృతిచెందారు.