Candidates Ultimatum | టీజీపీఎస్సీకి గ్రూప్-1 అభ్యర్థుల అల్టిమేటం.. జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష
Candidates Ultimatum | టీజీపీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు , బాధితుల ప్రతినిధి బృందం టీజీపీఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.
హైదరాబాద్ : టీజీపీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ( Candidates) , బాధితుల ప్రతినిధి బృందం టీజీపీఎస్సీ ( TGPSC) కమిషన్ ఛైర్మన్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. నియామక ప్రక్రియ ముగిసి తుది ఫలితాలు వెల్లడైనప్పటికీ, దానికి సంబంధించిన ప్రాథమిక సమా చారాన్ని , వెరిఫికేషన్ మెట్రిక్స్‌ను గోప్యంగా ఉంచడంపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
2024 ఆగస్టు 7న కమిషన్ ఇచ్చిన అధికారిక ప్రకటనలో ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ , మెయిన్స్ రాత పరీక్షలకు సంబంధించిన కమ్యూనిటీ, కేటగిరీ, జెండర్ మల్టీ-జోన్ల వారీ అధికారిక కటాఫ్ మార్కులను తక్షణమే విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకుడు కొడంగల్ రవికుమార్ డిమాండ్ చేశారు. కటాఫ్ మార్కులు ప్రకటించకపోడం వల్ల 1:50 నిష్పత్తి ఎంపిక నిబంధనల ప్రకారం సక్రమంగా జరిగిందా లేదా అనేది అభ్యర్థులు స్వయంగా ధృవీకరించుకునే అవకాశం లేకుండా పోయిందని ఆరోపించారు.
దీనితో పాటు ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ నంబర్లను, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లతో నేరుగా అనుసంధానించే (Mapping Sheet) ప్రక్రియను నిరాకరించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తంచేశారు. అభ్యర్థుల పేరు, రోల్ నంబర్, రెండు దశల మార్కులు ,వారికి చివరగా కేటాయించిన ఉద్యోగాల వివరాలతో కూడిన ఒక సంయుక్త ఇంటిగ్రేటెడ్ మాస్టర్ మ్యాట్రిక్స్ ను బహిరంగంగా వెబ్సైట్లో ప్రచురించాలని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ (UPSC) , ఇతర పొరుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనుసరించే అత్యున్నత పారదర్శక ప్రమాణాలను, స్కోర్‌కార్డుల విధానాన్ని టీజీపీఎస్సీలోనూ శాశ్వతంగా అమలు చేయాలని కోరారు. కమిషన్ ఇచ్చిన లిఖితపూర్వక హామీలను నిలబెట్టుకోలేని పక్షంలో వందలాది మంది అభ్యర్థులతో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Candidates Ultimatum | టీజీపీఎస్సీకి గ్రూప్-1 అభ్యర్థుల అల్టిమేటం.. జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష
Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

