Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Bus Collides With Truck | ఒక లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బెంగళూరు: ఒక లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Bus Collides With Truck) కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హుక్కేరి తాలూకాలోని సంకేశ్వర్ సమీపంలో జాతీయ రహదారి 48పై కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) బస్సు ఒక టిప్పర్ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మరణించగా 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అత్యవసర సహాయక సిబ్బంది గాయపడిన వారిని సంకేశ్వర్ తాలూకా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, మరో సంఘటనలో కర్ణాటకలోని సాగర్ తాలూకాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రైవేట్ స్లీపర్ బస్సు పూర్తిగా కాలిపోయింది. ముంబాలు గ్రామం సమీపంలో తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. బెంగళూరు నుంచి సాగర్‌కు ప్రయాణిస్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్, క్లీనర్ తక్షణమే స్పందించారు. దీంతో అందులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ బస్సు శివమొగ్గలో ఆగినప్పుడు చాలామంది దిగిపోయారు. సాగర్ వెళ్లే మార్గంలో కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

