Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
Narendra Modi : ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని జెవార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
Narendra Modi : ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని జెవార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. యూపీ రాజధాని లక్నోలో శుక్రవారం ఉన్నతస్థాయి క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
గుజరాత్ సీఎంగా, ప్రధానిగా మోదీ ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం యోగి చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా సేవలో వరుసగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీకి యోగి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో ఇండియా ప్రపంచవ్యాప్తంగా కొత్త గుర్తింపును పొందిందన్నారు. అలాగే, మానవతా విలువల్ని కాపాడారని ప్రశంసించారు. ఇదే సమయంలో మోదీ నాయకత్వంలో యూపీ వారసత్వపరంగా, అభివృద్ధి పరంగా కొత్త శకంలోకి అడుగుపెట్టిందన్నారు.
మోదీకి, ఉత్తర ప్రదేశ్‌కు ఉన్న అనుబంధం ప్రత్యేకమైందని గుర్తు చేశారు. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య టీమిండియా స్పిరిట్ నడుస్తోందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో సమన్వయంతో పని చేస్తుందన్నారు. యూపీ మంత్రుల బృందం ప్రధానికి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని వివరించారు. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి రాకముందు పరిపాలనలో అసమర్ధత కనిపించేందన్నారు. రాష్ట్రంఓ కనీస వసతులు కూడా ఉండేవి కావని గుర్తు చేశారు. కానీ, మోదీ ప్రభుత్వ పాలన, పనితీరును స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ప్రభుత్వ పాలనను అమలు చేస్తున్నట్లు యోగి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

