పోలవరం, ఏప్రిల్ 14 : గోదావరి రివర్ మానేజ్మెంట్ బోర్డు చైర్మన్ (జీఆర్ఎంబీ) పీ దోర్జీ గ్యాంబ పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను ఆయన తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎంబీ చైర్మన్ దోర్జీకి అతిథి గృహం వద్ద పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా, పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ రవి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ఈ ఆర్ రామచంద్ర రావు, ఈఈలు డి. శ్రీనివాస్, పీ వెంకటరమణ, కె బాలకృష్ణ, డీఈఈలు శ్రీకాంత్, మాధవరావు, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి స్వాగతం పలికారు. కొద్దిసేపు వారితో సమావేశమైన పీ దోర్జి గ్యాంబ తరువాత పోలవరం స్పిల్ వే, ఎగువ కాఫర్ డ్యామ్, గ్యాప్ 1, 2లను పరిశీలించారు. నిర్ధిష్ట గడువు లోపు పనులు పూర్తి చేయాలని సూచించారు.