Karnataka | బెంగళూరు, జూన్ 19: వర్షాలు పడాలని తమ పూర్వీకుల సమాధులను తవ్వుతున్నారు కర్ణాటకలోని హవేరీ ప్రాం తవాసులు. చర్మవ్యాధులతో చనిపోయినవారి సమాధులను బయటికి తీసి.. దాన్ని వరుణుడికి చూపిస్తే శాంతించి వర్షాలు కురిసేలా చేస్తాడన్న మూఢ నమ్మకంతో ఈ పనులు చేస్తున్నారు. అంతేకాదు.. వర్షాల కోసం జంతువులు, బొమ్మలను పెండ్లి చేసుకుంటారు. నగ్నంగా ఊరంతా తిరుగుతూ బిక్షం అడుగుతారు. ఇలా చేస్తే వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తారని వారి నమ్మకం.
రుతుపవనాలు ఒక్కసారిగా కనుమరుగు కావటంతో గత రెండు వారాలుగా సమాధులను తవ్వి.. మళ్లీ కుటుంబసభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇలా చేస్తే కొత్త శక్తితో వర్షాలు తిరిగి వస్తాయని పేర్కొంటున్నారు.