తిరుమల : తిరుమలలో మంగళవారం గోకులాష్టమి ( Gokulashtami ) వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోసంరక్షణశాలలో గోవులకు ప్రత్యేక పూజలు చేశారు . టీటీడీ(TTD) ఈవో జె.శ్యామలరావు దంపతులు, అధికారులు భక్తులకు గోకులాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుచానూరు (Tiruchanur )పద్మావతి అమ్మవారి ఆలయంలో వున్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయం, తిరుపతిలోని గోవిందరాజ స్వామివారి ఆలయంలో, కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఉన్న వేణుగోపాలస్వామివారి ఆలయం, నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 28న ఉట్లోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తిరుమలలో 31 కంపార్టుమెంట్లలో వేచియున్న భక్తులు
తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 76,910 మంది భక్తులు దర్శించుకోగా 30,320 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.26 కోట్లు వచ్చిందన్నారు.