MLA SANJAY | కోరుట్ల : ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల రైతులకు సూచించారు. మండలంలోని సంగెం. నాగులపేట గ్రామాల్లో ఐకేపీ, సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పురష్కరిస్తామన్నారు.