హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో కృత్రిమ మందుల కొరత సృష్టిస్తే చర్య లు తప్పవని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. సెంట్రల్ మెడికల్ స్టోర్స్(సీఎంఎస్)బలోపేతంపై మంత్రి శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ ఫెసిలిటీ పనితీరుపై ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అందజేసిన నివేదికపై చర్చించారు. ప్రభుత్వ దవాఖానల్లో ఫార్మాసిస్టులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఫుడ్సేఫ్టీపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఫుడ్సేఫ్టీపై తీసుకుంటున్న చర్యలపై కమిషనర్ ఆర్వీ కర్ణన్ పీపీటీ ద్వారా వివరించారు. అనంతరం మం త్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. ఆహా ర కల్తీకి పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షల్లో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ బోరడే, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, ఐపీఎం డైరెక్టర్ శివలీల, డాక్టర్ అమర్ సింగ్, శేషాశ్రీ తదితరులు పాల్గొన్నారు.