త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లు

- విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడి
- బయోమెట్రిక్ చిప్‌తో ‘ఈ-పాస్‌పోర్ట్’ భద్రత భేష్
న్యూఢిల్లీ, జనవరి 6: భారతీయులకు త్వరలోనే ఈ-పాస్‌పోర్టులను జారీ చేయనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడించారు. బయోమెట్రిక్ సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఈ ‘ఈ-పాస్‌పోర్టు’లను అత్యంత భద్రతా ప్రమాణాలతో తయారు చేయనున్నట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయ వలస విధానాలకు అనుగుణంగా ఇవి ఉండబోతున్నట్టు వివరించారు.
- విశేషాలు
- వ్యక్తి బయోమెట్రిక్ డాటాను నిక్షిప్తం చేసుకోవడానికి ఈ-పాస్‌పోర్టులో ఒక చిప్ ఉండనున్నట్టు, అందులోనే వ్యక్తి పూర్తి వివరాలు నమోదు చేయనున్నట్టు సమాచారం.
- రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ద్వారా కూడా ఈ-పాస్‌పోర్టు నుంచి సమాచారాన్ని తస్కరించడానికి వీలుపడదు. దొంగతనం చేయడానికి కుదరదు. ఫోర్జరీ కూడా చేయలేం.
- ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) ప్రమాణాలకు అనుగుణంగా ఈ-పాస్‌పోర్టులను తయారు చేయనున్నారు. వీటిని నాశనం చేయడం అంత సులువు కాదు.
- వివిధ దేశాల్లో పాస్‌పోర్టును సులభంగా గుర్తించేందుకు చిప్ పక్కన ప్రత్యేక లోగోను వేయనున్నారు.
- 20 వేల మంది దౌత్య అధికారులకు తొలుత ఈ-పాస్‌పోర్టులను ప్రయోగాత్మకంగా జారీ చేస్తారు. సమస్యలు తలెత్తకపోతే, అనంతరం అందరికీ ఇస్తారు.
- దేశంలోని 36 పాస్‌పోర్టు కేంద్రాల్లో ఈ-పాస్‌పోర్టులను జారీ చేయనున్నారు.
- ప్రస్తుతం పాస్‌పోర్టు దరఖాస్తు కోసం ఎలాంటి విధానాలను పాటిస్తున్నారో.. అవే నిబంధనలు ఈ-పాస్‌పోర్టుకూ వర్తిస్తాయి. పాస్‌పోర్టు జారీ సమయంలో కూడా తేడా ఉండదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

