ఎల్లారెడ్డిపేట: అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ( Soake Paddy ) ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ( BRS ) నాయకులు డిమాండ్ చేశారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండల కేంద్రంలోని ఐకెపీ సెంటర్లో నిలువ ఉంచి ధాన్యం రాశులు తడిసిపోయాయి. ఈ సందర్భంగా బుధవారం బీఆర్ఎస్ నాయకులు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైతుల అకౌంట్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగన్న, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, నాయకులు మందాటి రాము, తదితరులు పాల్గొన్నారు.