
మణికొండ, జనవరి 6 : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ గీతారెడ్డి అన్నారు. రైతు బంధు సంబురాలలో భాగంగా నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్, వట్టినాగులపల్లి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం, రంగోళి పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబిరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఏడీఏ లీనా, వ్యవసాయ అధికారి మల్లారెడ్డి, విస్తరణ అధికారి శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్ యాదమ్మ, ప్రధానోపాధ్యాయులు మధుకర్, శకుంతల పాల్గొన్నారు.