Gold Seized | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి, జడ్డా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి వద్ద 1.93 కిలోల బంగారాన్ని పట్టుకోగా.. దాన్ని విలువ రూ.1.27కోట్ల విలువ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. క్యాప్సూల్స్ రూపంలో బంగారాన్ని తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్నారు. ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.