న్యూఢిల్లీ, నవంబర్ 17: పసిడి ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.400 దిగొచ్చి రూ.48,110 వద్దకు చేరుకున్నది. అంతకుముందు రూ.48,510గా ఉన్నది. వెండి కూడా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల కొనుగోళ్ళకు మొగ్గుచూపకపోవడంతో కిలో వెండి రూ. 520 తగ్గి రూ.65,210కి పరిమిత మైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.280 తగ్గి రూ.50 వేలకు చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.45,900 వద్ద నిలిచింది. రూ.500 తగ్గిన కిలో వెండి రూ.71 వేలకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,857 డాలర్లకు చేరుకోగా, వెండి 25.03 డాలర్లుగా నమోదైంది.