కాళేశ్వరం, జూలై 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం ఉదయం నాటికి గోదావరి 6.25 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో సాయంత్రానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి ప్రస్తుతం 1,01,530 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా, అదే స్థాయిలో 1,01,530 క్యూసెక్కుల నీటిని అవుట్ఫ్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.