మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell).. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2015, 2019 సంవత్సరాల్లో వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. తక్షణమే వన్డేల నుంచి వైదొలుగుతున్నట్లు అతను ఇవాళ ప్రకటించాడు. వన్డే క్రికెట్‌ను ఇక ఆడలేనన్నాడు. ఆస్ట్రేలియా తరపున అతను మొత్తం 149 వన్డేలు ఆడాడు. వన్డేలకు గుడ్‌బై చెప్పినా.. టీ20లకు అందుబాటులో ఉండనున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలన్న ఆసక్తిని కూడా అతను వెల్లడించాడు.
మ్యాక్స్‌వెల్ వయసు 36 ఏళ్లు. అయితే అతను ఇంకా టెస్టు క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌లో ఆసీస్ ఓడిన తర్వాత ఆ జట్టు ప్లేయర్ స్టీవన్ స్మిత్ వన్డేలకు వీడ్కోలు పలికారు. ఆ బాటలోనే మ్యాక్స్‌వెల్ అడుగులు వేశారు. ఫైనల్ వర్డ్ పోడ్కాస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను వన్డే రిటైర్మెంట్కు చెందిన ప్రకటన చేశారు. 2022లో తన కాలు విరిగిన తర్వాత సమస్య ఎక్కువైందని, ఇక తాజా చాంపియన్స్ ట్రోఫీలో ఆ సమస్య మళ్లీ పెరిగినట్లు చెప్పారు.
వన్డేల్లో మ్యాక్స్‌వెల్ రికార్డు అద్భుతంగా ఉంది. 149 వన్డేల్లో అతను 3990 రన్స్ చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 33.81గా ఉన్నది. ఇక 47.32 సగటుతో అతను 77 వికెట్లు తీసుకున్నాడు.
After a truly memorable ODI career, Glenn Maxwell has called time on that format: https://t.co/ktWUdnmoVM pic.twitter.com/hn5zCZdE5V
— cricket.com.au (@cricketcomau) June 2, 2025