e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News కెమెరాకు చిక్కిన అరుదైన అక్టోప‌స్‌..

కెమెరాకు చిక్కిన అరుదైన అక్టోప‌స్‌..

ఫీనిక్స్ ఐలాండ్: ఇది త్రీడీ అక్టోప‌స్ కాదు. ఇదో ట్రాన్స్‌ప‌రెంట్ జీవి. దీన్నే గ్లాస్ అక్టోప‌స్ అని పిలుస్తున్నారు. ఈ అద్భుత‌మైన స‌ముద్ర జీవి.. నీటిలోనూ మిళ‌మిళ మెరుస్తూ క‌నిపిస్తోంది. పార‌ద‌ర్శ‌కంగా ద‌ర్శ‌న‌మిస్తున్న ఈ అక్టోప‌స్ ఫోటోలు.. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సముద్ర గ‌ర్భంలో ప‌రిశోధ‌న‌లు చేసే శాస్త్ర‌వేత్త‌ల‌కు అత్యంత అరుదైన ఈ అక్టోప‌స్ చిక్కింది. సెంట్ర‌ల్ ప‌సిఫిక్ స‌ముద్రంలో అన్వేష‌ణ చేస్తున్న స‌మ‌యంలో ఇది కెమెరా కంట ప‌డింది. ఫీనిక్స్ దీవుల్లోని టోక‌లే రిడ్జ్ వ‌ద్ద ఉన్న విన్‌స్లో రీఫ్ కాంప్లెక్స్ స‌ముద్ర జ‌లాల్లో సుమారు 651 మీట‌ర్ల లోతులో ఈ ఆక్టోప‌స్‌ను గుర్తించారు.

స్కిమిడ్ ఓషియ‌న్ రీస‌ర్చ్ నౌక‌లో 34 రోజుల పాటు స‌ముద్ర అన్వేష‌ణ చేసిన బృందానికి ఈ అద్భుత జీవి క‌నిపించింది. సుమారు 30 వేల కిలోమీట‌ర్ల మేర స‌ముద్రాన్ని హై రెజ‌ల్యూష‌న్ కెమెరాల‌తో ఆ ప‌రిశోధ‌కులు శోధించారు. ఆ స‌మ‌యంలో ఈ అక్టోప‌స్ ద‌ర్శ‌న‌మిచ్చింది. గ్లాస్ అక్టోప‌స్‌గా పిలుస్తున్న ఈ జీవికి చెందిన కంటి న‌రం, క‌నుగుడ్లు, జీర్ణాశ‌యం క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నాయి. అయితే శ‌త్రు జీవుల నుంచి త‌ప్పించుకునే రీతిలో ఈ అక్టోప‌స్ త‌న ఆకృతిని తీర్చుదిద్దుకున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana