హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : ఎంప్లాయ్ హెల్త్ సీమ్‌లో ఎయిడెడ్, మోడల్ సూల్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రాధాన్యమివ్వాలని, వారికి కూడా ఈ పథకం వర్తింపచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీంతో స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రతిపాదనను అమల్లోకి తేవాలని సీఎస్ రామకృష్ణరావును ఆదేశించారు.
ఇటీవల రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పేరి వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి పెన్షనర్ల సమస్యలను వివరించారు. రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను జాప్యం చేయకుండా విడుదల చేయాలని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.