న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు రాయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. కోవిడ్ వల్ల పరీక్షలకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులు పెట్టుకున్న అప్పీల్‌ను పరిశీలించాలని కోర్టు కేంద్రాన్ని కోరింది. పరీక్ష మిస్సైన వారికి అదనపు పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని కోర్టు తన సూచనలో పేర్కొన్నది. రెండు వారాల్లోగా దీనిపై నిర్ణయాన్ని వెల్లడించాలని కోర్టు చెప్పింది. పార్లమెంటరీ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.