సిటీబ్యూరో, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ రెండో కౌన్సిల్ సమావేశం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కా ర్యాలయంలో జరిగింది. మేయర్ సభను ప్రారంభి స్తూ జీహెచ్ఎంసీ అధ్వర్యంలో వివిధ విభాగాల ద్వారా చేపట్టిన పనులనూ సభ్యులకు వివరించారు. సమావేశంలో శ్మశాన వాటికలు, సీఆర్ఎంపీ, స్ట్రీట్ వెండర్స్, ఎస్ఎన్డీపీ, శానిటేషన్ అంశాలపై చర్చ జరిగింది.
నాలా సమస్యలే అధికం..
నాలాల అక్రమణలపై ప్రధానంగా చర్చ జరిగింది. నాలాలకు ప్రహరిగోడల నిర్మాణం వేగవంతం చేయాలని టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు సూచించారు. బుల్కాపూర్ నాలా గేట్ల తాళాలు జీహెచ్ఎంసీ దగ్గర లేకపోవడం, ఇతర శాఖల వారి వద్ద ఉండటం వల్ల అత్యవసర సందర్భాలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానిక కార్పొరేటర్ ఆందోళన వ్యక్తం చేశారు. సుల్తాన్ చెరువు నాలా నిర్మాణానికి జాప్యం చేయకుండా టెండర్లను ఆహ్వానించాలని, లింగోజీగూడలో ఎస్ఎన్డీపీ నాలా పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ రాజశేఖర్ కోరారు. కార్యక్రమంలో కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, ఎక్స్ అఫీషియో సభ్యులు మలాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, శాసన మండలి సభ్యులు సయ్యద్ అమినుల్ హాసన్ జాఫ్రీ, మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బొగ్గారపు దయానంద్, సురభి వాణీదేవి, శాసన సభ్యులు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కౌసర్ మోహినుద్దిన్, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, జి.సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, టి.ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ జియా వుద్దిన్, సీఈలు దేవానంద్, వసంత, అడిషనల్ కమిషనర్లు బి.సంతోష్, విజయలక్ష్మి, వి కృషన్ జయరాజ్ కెన్నెడీ, జోనల్ కమిషనర్లు ప్రియాంక అలా, పంకజ, రవి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ సామ్రాట్, మమత కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు.
అభివృద్ధికి పాటుపడుదాం
రాజకీయాలు వద్దు. అందరం కలిసి కట్టుగా మహా నగరాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు సాగుదాం. నగర అభివృద్ధి మిషన్ మోడ్‌లో జరుగుతుంది, మంత్రి కేటీఆర్ సంకల్పం మేరకు నగరాన్ని అంతర్జాతీయంగా తీర్చిదిద్దుదాం. రాష్ట్రం ఏర్పడ్డాక నగరంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, సుందరీకరణ పనులు అన్ని శాఖల సమన్వయంతో జరుగుతున్నాయి.
ఆమోదం పొందిన అంశాలు..
ప్రజా ప్రతినిధుల మధ్య చర్చ వచ్చిన అంశాలలో ఆమోదం పొందినవి ఇలా ఉన్నాయి. మేయర్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన 9 అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మేయర్ తెలిపారు.
“జీహెచ్ఎంసీ అకౌంట్లను ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు ఏజెన్సీ కాంట్రాక్టు మూడేళ్లు పొడిగింపు. జీహెచ్ఎంసీలో 20 మ్యాడ్యుల్స్ నిర్వహణ కోసం మరో మూడేళ్ల పొడిగింపు. ‘సేఫ్ సిటీ’లో భాగంగా నాంపల్లి సరయు ఖాళీ స్థలంలో ట్రాన్సిట్ డ్రోమ్స్ నిర్మాణం. సాకి చెరువు నుంచి గంగారాం చెరువు వరకు మురుగు నీరు బ్యాలెన్స్ పనులకు రీమోడలింగ్. నాగోల్ నుంచి మూసీనది వరకు బాక్స్ డ్రైన్ నిర్మాణం. రాజేంద్రనగర్ కాటేదాన్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో మౌలిక సదుపాయాలు స్విమ్మింగ్ పూల్, ఎలక్ట్రికల్ పనులు. నెహ్రూ సఫారీ నుంచి కిషన్ బాగ్ క్రాస్ రోడ్డు వరకు కంపౌండ్ వాల్ మార్పు, ములీ నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణం. జవహర్‌నగర్ డంపు యార్డులో లిచెట్ ట్రీట్మెంట్ డిస్పోజల్ ప్లాట్ నిర్మాణం. రామానాయుడు స్టూడియో నుంచి సినర్ వ్యాలీ పనులు, శాఖ నిధులతో చేపట్టిననందున కాంట్రాక్టర్‌కు ఏజెన్సీకి ఈఎండీ
విడుదల”.
మీడియాపై ఆంక్షలు..
కౌన్సిల్ సమావేశంలో మీడియాపై ఆంక్షలు విధించడం పట్ల జర్నలిస్టులంతా నిరసన ప్రదర్శన చేపట్టారు. జీహెచ్ఎంసీ చరిత్రలో మొదటిసారి మీడియా అనుమతించకపోవడం దురదృష్టమని పేర్కొంటూ జర్నలిస్టులంతా మేయర్ ఛాంబర్, సమావేశ మందిరం ముందు కూర్చొని నిరసన తెలిపారు.