హైదరాబాద్ : ఇంటి నిర్మాణానికి ( House Construction ) అవసరమయ్యే అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసిన జూనియన్ అసిస్టెంట్‌ను ఏసీబీ( ACB ) అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. బోరబండ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి శ్రీలత ( Srilatha ) సోమవారం బాధితుడి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఇంటి నిర్మాణానికి మీ సేవ (Mee Seva) కేంద్రంలో దరఖాస్తు చేసుకునే దశ నుంచి దానిని ప్రాసెస్ చేసి, గృహ నిర్మాణ అనుమతిని అందజేసే దశ వరకు జూనియర్ అసిస్టెంట్ మొత్తం రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా తొలి విడతగా యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద రూ.లక్షా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకు ఆమెపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.