అమరావతి : టీవీకే ( TVK ) ను స్థాపించిన అనతికాలంలోనే తమిళనాడులో భారీ విజయాన్ని సాధించిన విజయ్ ( Vijay ) కు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) అభినందించారు. సోమవారం పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చెరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుడిన సందర్భంగా ఆయన స్పందించారు.
తమిళనాడులో సింహభాగం ప్రజలు విజయ్‌వైపు మొగ్గుచూపారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కూటమి పోరాటం కూడా బలమైనదేనని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో కాషాయం జెండాను ఎగుర వేసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా చేసిన కృషి సత్ఫలితాలిచ్చిందని అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ టీవీకే అధినేత విజయ్‌కు అభినందనలు తెలిపారు.