హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సన్నిహితుడైన మేకపాటి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేకపాటి, మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడన్నారు.
ఎంతో నిబద్ధత, క్రమశిక్షణతో పని చేసే మేకపాటి చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.