తిరుమల : తిరుమలలో ( Tirumala ) జూలై మాసంలో గురు పౌర్ణమి ( Gurupournami) , గరుడ పంచమి పర్వదినాల సందర్భంగా టీటీడీ ( TTD ) రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనుంది. జూలై 10న గురు పౌర్ణమి, జూలై 29న గరుడ పంచమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అర్చకులు వివరించారు. సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరుగుతుందని పేర్కొన్నారు.
కృష్ణా తేజ గెస్ట్‌హౌజ్ వరకు భక్తుల క్యూలైన్..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్ని నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్‌హౌజ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. నిన్న స్వామివారిని 87,536 మంది భక్తులు దర్శించుకోగా 35,120 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 3.33 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.