వీణవంక: బీజేపీ నాయకులు ఓటుకు రూ. 10వేలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని, తమ గ్రామంలో చిచ్చుపెడుతున్నారని ఆరోపిస్తూ వీణవంక మండలంలోని గంగారం గ్రామానికి చెందిన దళితులు రోడ్డుపై బైటాయించారు. దళిత కాలనీలో ఈటల రాజేందర్ అనుచరులు ఒక వర్గానికి చెందిన వారికే ఓటుకు రూ.10 వేలు పంచుతున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ ఆత్మగౌరవం అని అంటూనే ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వారిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బులతో దళితుల ఆత్మగౌరవాన్ని కొనాలనుకుంటున్న బీజేపీ ఈటల రాజేందర్‌కు ఓటుతో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.