Ganesh in mosque : సాధారణంగా హిందువులు మాత్రమే వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ ఆ గ్రామంలో మాత్రం ముస్లిం సోదరులు మసీదు (Mosque) లో వినాయక విగ్రహాన్ని (Ganesh Idol) ఏర్పాటు చేశారు. నిత్యపూజలు చేస్తున్నారు. మహారాష్ట్ర (Maharastra) లోని సాంగ్లీ జిల్లా (Sangli district) లోగల గోట్ఖిండీ గ్రామం (Gotkhindi village) లో చోటుచేసుకున్న ఈ ఘటన మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
అయితే గోట్ఖిండి గ్రామానికి ముస్లిం సోదరులు ఈసారి మాత్రమే కాదు, ప్రతి ఏటా మసీదులో గణేశుడి విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తున్నారు. 1980లో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. ఎందుకంటే 1980లో గోట్ఖిండి గ్రామంలో భారీ వర్షం కారణంగా వరదలు రావడంతో.. ఆరుబయట మండపంలో ఉన్న గణేశుడి విగ్రహాన్ని గ్రామంలోని మసీదులోకి మార్చారు. ఆ తర్వాత నిమజ్జనం వరకు అక్కడే పూజలు చేశారు.
ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది మసీదులోనే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. హిందూముస్లింలు ఉమ్మడిగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఒకసారి బక్రీద్, వినాయక చవితి ఒకేసారి వచ్చాయి. అప్పుడు ముస్లింలు నమాజ్ మాత్రమే చేసి, కుర్బానీ (గొర్రెలను బలిచ్చే ప్రక్రియ) కి దూరంగా ఉన్నారు.