Ganapati Puja At Police Station | పోలీస్ స్టేషన్లో హోమం.. రేకెత్తించిన రాజకీయ వివాదం
Ganapati Puja At Police Station | బాలిక మిస్సింగ్ కేసుపై ఒత్తిడి, ప్రమాదం వంటి అవాంఛనీయ సంఘటనలకు ఒక పోలీస్ అధికారి కలత చెందారు. ఈ నేపథ్యంలో కొందరి సలహా మేరకు ఏకంగా ఆ పోలీస్ స్టేషన్లో హోమం నిర్వహించారు. దీంతో రాజకీయ వివాదానికి ఇది దారితీసింది.
చెన్నై: బాలిక మిస్సింగ్ కేసుపై ఒత్తిడి, ప్రమాదం వంటి అవాంఛనీయ సంఘటనలకు ఒక పోలీస్ అధికారి కలత చెందారు. ఈ నేపథ్యంలో కొందరి సలహా మేరకు ఏకంగా ఆ పోలీస్ స్టేషన్లో హోమం నిర్వహించారు. దీంతో రాజకీయ వివాదానికి ఇది దారితీసింది. (Ganapati Puja At Police Station) తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నడుపట్టు గ్రామానికి చెందిన రెండో తరగతి చదువుతున్న బాలిక రెండు నెలల కిందట ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు సత్యమంగళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమెదు చేసి ఆ బాలిక కోసం వెతికినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈ కేసును సీబీ-సీఐడీకి బదిలీ చేశారు.
కాగా. సత్యమంగళం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. బాలిక మిస్సింగ్ కేసుతో పాటు గత నెల రోజులుగా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మరికొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ఏకంగా ఆ పోలీస్ స్టేషన్లో తన భార్యతో కలిసి గణపతి హోమం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు కూడా ఈ పూజలో పాల్గొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటన తమిళనాడులో రాజకీయ వివాదానికి దారితీసింది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని డీఎంకే నాయకుడు సెంథిల్‌కుమార్ విమర్శించారు. ‘జ్యోతిష్యుల సలహాల ఆధారంగా పనిచేస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వం నుంచి ఏమి ఆశించగలం’ అని ఆయన ప్రశ్నించారు.
అయితే ఈ సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. పోలీస్ స్టేషన్ లోపల ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, సదరు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.
#WATCH | A video showing a Ganapathi Homam performed at a police station near #Gingee has gone viral. Reports suggest the ritual was conducted following a series of cases registered at the station, including a missing minor girl case, a death, and an accident. https://t.co/EtcL6u667O
— The Federal (@TheFederal_News) November 21, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో ఘనంగా మత్స్య కార్మికుల దినోత్సవం
Ganapati Puja At Police Station | పోలీస్ స్టేషన్లో హోమం.. రేకెత్తించిన రాజకీయ వివాదం
AP Student | గుజరాత్‌లోని వడోదరలో ఏపీ విద్యార్థి మృతి
El Chapo Isidro | ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలోని డ్రగ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో అరెస్ట్..!
వైద్య సిబ్బందిపై డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

