గద్వాల, ఏప్రిల్ 13 : ఎన్నో ఏండ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీ పికబురు అందించింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బె డ్రూం ఇండ్లు అర్హులకు పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం లబ్ధిదారుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను వార్డుల వారీగా అభ్యంతరా లు స్వీకరించి ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుం డా అధికారులు అర్హులను ఎంపిక చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పరుమాల శివారు లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా.. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారు లు ఏర్పాట్లు చేశారు.
దీంతో నాలుగున్నర ఏండ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నా యి. గతంలో ఉన్న గృహ నిర్మాణ సంస్థలో ఎక్కువ గా అవినీతి చోటుచేసుకోవడం వల్ల ‘డబుల్’ ఇండ్ల ప్రారంభం కాస్త ఆలస్యమైంది. గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో ఇండ్ల నిర్మాణం పూర్తయింది. జిల్లా కేంద్రంలో పనులు పూర్తికాగా.. రంగులు కూడా వేశారు. పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలతో ఇండ్ల నిర్మాణానికి టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఎలాగైనా పేదోడి సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇండ్ల నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. కాం ట్రాక్టర్లతో మాట్లాడి నిర్మాణాలు చేపట్టాలని కోరడం తో.. గోన్పాడు, గద్వాలలో పనులు పూర్తయ్యాయి.
1,275 ఇండ్ల నిర్మాణం..
జిల్లా కేంద్రం సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్ వద్ద ఉన్న 41 ఎకరాల్లో 1,275 ఇండ్లు నిర్మించి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సహకారంతో ప నులు పూర్తయ్యాయి. జీప్లస్-1గా ఇండ్లు నిర్మించగా.. ఒక్కో బ్లాక్‌లో 24 గృహాలు ఉన్నాయి. ఒక్కో ఇంటికి సుమారు రూ.5.75 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. 1,275 ఇండ్ల కోసం 5,155 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి వార్డుకొక ప్రత్యేక అధికారిని నియమించి.. నిజమైన అర్హులను ఎంపిక చేసేలా చర్యలు చేపట్టారు. గ్రామసభల్లో సరైన అర్హులను ఎంపిక చేయలేదనని ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ స్వయంగా జాబితాను పరిశీలించారు. ఇలా.. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తరువాత.. 3,171 మందిని అర్హులుగా ప్రకటించారు. ఈ నెల 15వ తేదీన జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, కొంతమంది లబ్ధిదారులు కోర్టుకు వెళ్లగా.. 504 మందికి సంబంధించి అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం 771 మందికి డిప్ ద్వారా ఇండ్లు కేటాయించనున్నారు.
రిజర్వేషన్ ఇలా..
డబుల్ బెడ్రూం ఇండ్లను అధికారులు రిజర్వేషన్ ఆధారంగా కేటాయించనున్నారు. వికలాంగులకు 5 శాతం, ఎక్స్ సర్వీస్మెన్లకు 2, షెడ్యూల్డ్ కులాలకు 17, షెడ్యూల్డ్ తెగలకు 6, మైనార్టీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఏదేమైనా లబ్ధిదారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.