రాజాపేట, జూలై 14 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో సోమవారం పశుగ్రాస ముగింపు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్యశాఖ అధికారి డాక్టర్ మోతీలాల్ హాజరై మాట్లాడారు. పాడి పోషణ చేసే రైతులందరూ విరివిగా పశ్రుగాసాలు సాగు చేయాలని సూచించారు. పప్పు జాతి పశ్రుగాసాలైన దశరథ గడ్డి, మునగ, స్వీట్ పొటాటో, సుబాబుల్, లూసెర్న్, అలసంద, పిల్లి పెసర మొదలైన పప్పు జాతి పశ్రుగాసాలను సాగు చేయాలన్నారు. దాంతో రైతులు దాణా ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు.
వివిధ రకాల పశ్రుగ్రాసాలను ప్రదర్శించారు. అనంతరం 84 మంది పాడి రైతులకు దశరథ గడ్డి, న్యూట్రీఫీడ్ విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ కె.గోపిరెడ్డి, డాక్టర్ ఎం.చంద్రారెడ్డి, డాక్టర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ భాస్కర్, రాజపేట మిల్క్ సొసైటీ చైర్మన్ సందిల భాస్కర్ గౌడ్, పాల సీతలీకరణ కేంద్ర మేనేజర్ శేఖర్, కిషన్, ఉదయ్, రామ్ చందర్, శ్రీశైలం, మహేశ్, శ్రీకాంత్, ఆదర్శ రైతులు అంజిరెడ్డి, ఐలేశ్, లింగం పాల్గొన్నారు.