మోత్కూరు, డిసెంబర్ 16 : తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం మోత్కూరు పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యకుడు జంగ శ్రీను, మార్కెట్ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, కొణతం యాకుబ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేశ్, మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, రైతు బంధు మాజీ అధ్యక్షుడు కొండ సొమ్మల్లు, డీవీఎంసీ సభ్యుడు దాసరి తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు.
శాలిగౌరారం : గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకలను శాలిగౌరారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చాడ హతీశ్ రెడ్డి, కట్ట వెంకట్రెడ్డి, మామిడి సర్వయ్య, గుండా శ్రీనివాస్, అక్కినపల్లి శ్రీరాములు, పాక యాదయ్య, మెట్టు నగేశ్, గోదల సురేశ్ రెడ్డి, పనికిర కమలాకర్, రాచకొండ గణేశ్, మేడిపల్లి జలంధర్, నిమ్మల సాయిబాబా, రూపని నాగరాజు పాల్గొన్నారు.

Gadari Kishore : మోత్కూరు, శాలిగౌరారంలో గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకలు