హుజూరాబాద్‌టౌన్ : హుజూరాబాద్ శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ర్ట సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు వివిధ సంఘాల నుంచి వెల్లువలా మద్ధతు లభిస్తోంది. ఈ మేరకు అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మద్ధతు ప్రకటించింది.
కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించడమే కాకుండా ఉద్యమాలను అణచి వేయడానికి రైతులపై దమనకాంఢకు పాల్పడుతుందని ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ అధ్యక్షులు కోమటిరెడ్డి తేజ్‌దీప్‌రెడ్డి పేర్కొన్నారు. శాంతి యుతంగా ధర్నా చేస్తున్న రైతులపై లఖీంపూర్‌లో కేంద్ర మంత్రి కుమారుడు స్వయంగా వాహనం ఎక్కించి తొక్కించి రైతులను చంపిన సంఘటన హుజురాబాద్ ప్రజలు, రైతులకు కనువిప్పు కావాలని, బీజేపి చేస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా హుజూరాబాద్ ప్రజలు రైతాంగం ఖచ్చితంగా తమ తీర్పు ప్రకటించాలన్నారు.
లఖీంపూర్ రైతులను తొక్కించి చంపిన ఘటనతో పాటు బీజేపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను, ప్రజలను చైతన్య పర్చడం ద్వారా బీజేపిని ఓడించి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్న అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ర్ట కమిటీ నిర్ణయం మేరకు కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటించాలనే పార్టీ విధాన నిర్ణయానికి కట్టుబడి హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ర్ట సమితి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ కు ఆలిండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ మద్దతును ప్రకటిస్తున్నదని జిల్లా అద్యక్షుడు కోమటిరెడ్డి తేజ్‌దీప్‌రెడ్డి తెలిపారు.
అలాగే హుజురాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి హుజూరాబాద్ నియోజక క్రీడాకారులను, ప్రజలకు కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు హుజూరాబాద్ కబడ్డీ సంఘం, కబడ్డీ క్రీడాకారులు, హుజురాబాద్ హాకీ సంఘం, యువీ క్రీడాకారులు, హుజురాబాద్ బాస్కెట్ బాల్ సంఘం, బాస్కెట్ బాల్ క్రీడాకారులు మధ్ధతు ప్రకటంచారు.
హుజురాబాద్ క్రికెట్ సంఘం, క్రికెట్ క్రీడాకారులు, హుజూరాబాద్ ఫుట్‌బాల్ సంఘం, ఫుట్‌బాల్ క్రీడాకారులు, హుజురా బాద్ బ్యాడ్మింటన్ సంఘం, బ్యాడ్మింటన్ క్రీడాకారులు, హుజురాబాద్ యోగా సంఘం, యోగాకారులు టీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ శాట్స్ చైర్మన్‌కు హామీ ఇచ్చారన్నారు.