మహబూబ్‌నగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :బీఆర్ఎస్ సర్కారు ప్రజా సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలను అమలుచేస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే.. కొత్త వాటికి శ్రీకారం చుడుతున్నది. సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడంటే తప్పకుండా అమలు చేస్తారన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉన్నది. ఈ క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఇందులో అతి ముఖ్యమైనది ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా’.. ఈ పథకం కింద తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించడంతోపాటు ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. ఏ కారణం చేత మరణించినా ఇన్సూరెన్స్ చెల్లించేలా చర్యలు తీసుకోనున్నది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది లక్షల కుటుంబాలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనున్నది. ఇలాంటి నిర్ణయం గతంలో ఏ ప్రభుత్వానికి రాలేదని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని, బీఆర్ఎస్కే తమ పూర్తి మద్దతు అని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తున్నది. పేదలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. ఇప్పటికే రైతుబంధు, ఉచిత విద్యుత్, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుండగా.. తాజాగా పేదలకు కూడా ఆరోగ్య బీమా అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. తెల్లరేషన్‌కార్డు దారులు ఎవరైనా చనిపోతే రూ.ఐదు లక్షల బీమా చెల్లించనున్నది. ఎన్నికలు ముగిసిన వెంటనే మార్చి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదివరకే రైతుబీమా పథకంలో భాగంగా చనిపోయిన రైతులకు వారం, పది రోజుల్లోనే రూ.5 లక్షల బీమా నామినీ ఖాతాల్లో జమచేస్తున్నది. ఇదే కోవలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ కేసీఆర్ బీమా అందించనున్నది. ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ దీమా’తో ప్రజలకు భరోసా ఏర్పడనున్నది. సీఎం కేసీఆర్‌కే ఇలాంటి పథకాల అమలు ఆలోచన వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించనున్నది. పేదలకు కేసీఆర్ బీమా బాసటగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ బీమా.. పేదలకు ధీమా..
ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంటాయి. అలాంటి చారిత్రాత్మకమైన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేస్తుంటారు. ఏటా ఎంతోమంది ప్రమాదవశాత్తు, అనారోగ్య కారణాలు, రకరకాల ఒత్తిళ్లతో ప్రాణాలు కోల్పోతుంటారు. ఇంటి పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబానికి భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి కేసీఆర్ బీమా పేరిట నూతన పథకానికి అంకురార్పణ చేశారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చి నుంచి ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. రైతుబీమా పథకం ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నది. ఈ పథకం కింద వచ్చిన డబ్బులతో ఎంతోమంది పేద రైతు కుటుంబాల అవసరాలు తీరాయి. ఇదే కోవలో కేసీఆర్ బీమా పథకం చేరనున్నది. ప్రీమియం ప్రభుత్వమే చెల్లించనున్నది.
ప్రజల్లో వెల్లివిరుస్తున్న ఆనందం..
బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో విపక్షాల గుండెల్లో గుబులు రేపుతున్నది. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రణాళికపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఏ ప్రధాన పార్టీ కూడా ఇంత చక్కగా పేద, మధ్య తరగతి అగ్రవర్ణాల వారి గురించి ఆలోచించలేదని ప్రజలు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రజల బతుకుకు భరోసానిచ్చి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించనుండడంతో సంబురపడుతున్నారు. పేదలకు ఎవరికీ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న ఆలోచన ఉండదు. ఆర్థిక స్థోమత ఉన్నా చిన్న ప్రీమియం చెల్లిస్తుంటారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రీమియం చెల్లించి బీమా వర్తింపజేస్తామని హామీ ఇవ్వడంతో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటిస్తామని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ఘంటాపథంగా చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో లక్షల మందికి లబ్ధి..
సీఎం కేసీఆర్ హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుతుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉన్నది. ఈ క్రమంలో ‘కేసీఆర్ బీమా’ కూడా తప్పకుండా అమలవుతుందన్న విశ్వాసం ఉన్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో 2,20,546, నాగర్‌కర్నూల్ జిల్లాలో 2,38,014, వనపర్తి జిల్లాలో 1,46,844, జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,49,790, నారాయణపేట జిల్లాలో 1,30,798 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కేసీఆర్ బీమా కింద ఉమ్మడి జిల్లాలో సుమారు 8.86 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు మద్దతు పెరుగుతున్నది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతున్నది. పేదలను ఆదుకునేది బీఆర్ఎస్ ఒక్కటేనని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు.
అర్హులందరికీ బీమా.. అద్భుత ఆలోచన
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో అందరికీ ఆమోద యోగ్యంగా ఉన్నది. ఇందులో బీపీఎల్ కార్డులోని అర్హులైన వారందరికీ రైతుబీమా తరహాలో రూ.5లక్షల కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ దీమాగా ప్రవేశపెట్టడం అద్భుత ఆలోచన. ఇప్పటికే రైతుబీమాను కల్పించిన సీఎం కేసీఆర్, రైతు చనిపోతే 10రోజుల్లో ఆ కుటుంబం లోని నామినీ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. ఆ తరహాలోనే సాధారణ ప్రజలకు కూడా రూ.5 లక్షల బీమా కల్పిస్తుం డడంతో హర్షిం చ దగ్గ వి షయం. ఇలాం టి ఆలోచన గత ప్రభుత్వా లకు తట్టకపో వడం శోచనీ యం. ప్రతి పేద కుటుం బానికి సీఎం కేసీఆర్ పెద్దన్నగా మారారు. రాజేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించు కుంటాం.
-కె.శ్రీనివాస్ వ్యాపారి, జాజాపూర్.
భూమి లేని వారికి సువర్ణాకాశం
గుంట భూమి కూడా లేని పేదలకు సైతం కేసీఆర్ బీమా పేరిట రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించడం సంతోషించదగ్గ విషయం. ప్రైవేట్ పాలసీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ పథకాన్ని వర్తింపజేయడం హర్షణీయం. రైతుల బీమా మాదిరిగానే కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు, సహజంగా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి ఈ బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. భూమి లేని వారికి ఈ అవకాశం కల్పించడం చాలా సంతోషపడుతున్నాం. ఈ బీమాతో కుటుంబమంతా ధీమాగా ఉండవచ్చు. గతంలో ఏ పార్టీ, ప్రభుత్వం ఇలాంటి పథకాలు అమలు చేయలేదు. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న పథకాలు అన్ని అమలుపర్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తాడు.
– రాసమోని స్వప్న, కొత్తకోట
కేసీఆర్ బీమా.. అందరికీ ధీమా..
కేసీఆర్ బీమాతో ప్రతి పేద కుటుంబానికి ధీమా లభించనున్నది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ సార్ రైతులకు ఎంతగానో చేసిండు. అదేవిధంగా కుల వృత్తులకు జీవం పోసిండు. రైతుబంధు, రైతు బీమా, దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మి.. ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చి అందరినీ మంచిగా చూసుకుంటున్నడు. ఇప్పటివరకు రైతు చనిపోతే ఆ కుటుం బం రోడ్డున పడకుండా ఉండేందుకు నామినీ ఖాతాలో రూ.5లక్షలు జమ చేసేటోళ్లు. ఇప్పుడే మో ప్రతి పేద కుటుంబంలో ఎవరు చనిపోయినా రూ.5లక్షలు ఇస్తామని మొన్న ప్రవేశపెట్టిన మ్యా నిఫెస్టోలో కేసీఆర్ సార్ చెప్పిండు. ఇది చాలా మంచి ఆలోచన. ఈ పథకం అమలు అయితే ఎ న్నో కుటుంబాలు బాగుపడతయ్. రూ.5లక్షల బీ మాను బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టడం సంతోషంగా ఉంది. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు పదేండ్లుగా అమలవుతూనే ఉన్నాయి. ప్రతి ఇంటి కీ బీమా ఇవ్వడం సంతోషంగా ఉంది. పేదలకు అండగా ఉండే సర్కారుకు అండగా ఉందాం..
-బాలరాజు, ఎదిర 4వ వార్డు, మహబూబ్‌నగర్
పేదోళ్ల జీవితాలకు కేసీఆర్ భరోసా
సీఎం కేసీఆర్ సార్ పేదల పక్షపాతి. పేదోళ్ల జీవితాలకు భరోసా కల్పిస్తూ కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తామని మ్యానిఫె స్టోలో ప్రకటిండం గొప్ప విష యం. పేద కుటుంబా లకు ఆర్థిక భద్రత కల్పించేందు కు కేసీఆర్ బీమా పథకం మేలు చేస్తుందని భావిస్తున్నా. ఈ పథకం పేదల జీవితాలకు ఎల్లవేళలా భరోసా కల్పిస్తుంది. ఎల్ఐసీ ద్వారా పేదలకు పూర్తి బీమా ప్రీమియం చెల్లించడం, రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించడమనే ఆలోచన ఇప్పటివరకు ఏ సర్కారు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. నిరుపేదలు మృత్యువాత పడితే ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వంగా బీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది. ఇంత గొప్ప పథకం తీసుకురావడం సంతోషంగా ఉంది. ఆహార భద్రత కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ రూ.5లక్షల కేసీఆర్ బీమా వర్తింపజేయడం హర్షణీయం.
-శ్రీనివాసులు, అయిజ, జోగుళాంబ గద్వాల
కేసీఆర్ బీమా.. మాకు ఎంతో ధీమా…
సీఎం కేసీఆర్ పేదలంటే ఎంతో ప్రేమ చూపి స్తాడు. ఆసరా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్‌లాంటి పథకాలు ఎంతో మేలు కలిగించాయి. ఇదే తరహాలో బీఆర్ ఎస్ మ్యానిఫెస్టో లో రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమా పథకం తీసుకురావడం సంతోషంగా ఉంది. ఇది ఎంతో మంచి పథకంగా నిలుస్తుంది. పేదల కుటుంబాల్లో మృతి చెందితే ఆయా కుటుం బాలకు ఈ బీమా పథకం చేదోడు గా నిలుస్తుంది. తెల్లరేష న్ కార్డున్న అందరికీ ఈ పథకం వర్తింపజేస్తుం డటం గ్రేట్. ఈ పథకం వల్ల సీఎం కేసీఆర్ ఇంటి పెద్ద దిక్కుగా మారుతాడు. రైతుబీమా పథకంతో రూ.5లక్షల సాయం అందితే మా బంధువుల్లో ఒకరి కుటుంబం అప్పులు తీర్చుకొని కుదుట పడ్డారు. ఇదే విధంగా పేదలకు కూడా బీమా పథకం తీసుకురావడం సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుకు నిదర్శనంగా నిలుస్తుంది. సీఎం కేసీఆర్‌కు పేదలంటే ఎంతో సానుభూతి ఉంది. తెలంగాణ వచ్చాక అమలైనన్ని సంక్షేమ పథకాలు ఇంతకు ముందు ఎప్పుడూ లేవు. పేదల మనస్సుల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు. చెప్పడమే కాకుండా చేసి చూపించే నాయకుడు సీఎం కేసీఆర్. కరోనా కష్టాలున్నా సంక్షేమ పథకాలు అమలు చేసిండు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. అందుకే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో కేసీఆర్ బీమా, మహిళలకు నెలకు రూ.3000, రూ.400కే సిలిండర్‌లాంటి పథకాలు ప్రవేశ పెట్టారు.
– సారంగి గణేశ్, నాగర్‌కర్నూల్