తిరువనంతపురం: పలు రాష్ర్టాల్లో గ్యారెంటీల పేరుతో అలివికాని హామీలిచ్చి, గద్దెనెక్కాక గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీ.. కేరళలోనూ అదే ఫార్ములాకు సిద్ధమవుతున్నది. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గురువారం మ్యానిఫెస్టో విడుదల చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సామాజిక పెన్షన్లను రూ.3,000కు పెంచుతామంటూ హామీలు గుప్పించింది. మ్యానిఫెస్టో ప్రకారం, రైతులకు మద్దతు ధరగా ధాన్యం కేజీకి రూ.35 ఫిక్స్ చేసి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయంవంటి హామీలు గుప్పించింది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తే ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం కేటాయిస్తామని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రకటించింది. సీఎం పినరయ్ విజయన్ గురువారం ఎల్డీఎఫ్ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. విస్తృత సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా 60 పాయింట్లతో రెండు వాల్యూమ్స్గా దీనిని రూపొందించారు.