మహిళలకు ఉచిత బస్సు యూడీఎఫ్ మ్యానిఫెస్టో
పలు రాష్ర్టాల్లో గ్యారెంటీల పేరుతో అలివికాని హామీలిచ్చి, గద్దెనెక్కాక గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీ.. కేరళలోనూ అదే ఫార్ములాకు సిద్ధమవుతున్నది. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గురువారం మ్యానిఫెస్టో విడుదల చేసింది.
తిరువనంతపురం: పలు రాష్ర్టాల్లో గ్యారెంటీల పేరుతో అలివికాని హామీలిచ్చి, గద్దెనెక్కాక గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీ.. కేరళలోనూ అదే ఫార్ములాకు సిద్ధమవుతున్నది. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గురువారం మ్యానిఫెస్టో విడుదల చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సామాజిక పెన్షన్లను రూ.3,000కు పెంచుతామంటూ హామీలు గుప్పించింది. మ్యానిఫెస్టో ప్రకారం, రైతులకు మద్దతు ధరగా ధాన్యం కేజీకి రూ.35 ఫిక్స్ చేసి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయంవంటి హామీలు గుప్పించింది.
ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం: ఎల్డీఎఫ్ హామీ
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తే ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం కేటాయిస్తామని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రకటించింది. సీఎం పినరయ్ విజయన్ గురువారం ఎల్డీఎఫ్ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. విస్తృత సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా 60 పాయింట్లతో రెండు వాల్యూమ్స్‌గా దీనిని రూపొందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

