గ్రామసభలో అధికారులకు చుక్కెదురు
మండలంలోని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు గురువారం జరిగాయి. గట్టులో గ్రామసభ జరుగకుండా మాజీ ఎంపీటీసీ అడ్డుకున్నారు. సమస్యలు అనేకం ఉన్నాయని, దానికి సంబంధించిన అధికారులెవరూ గ్రామసభలో అందుబాటులో లేరని, అలాంటప్పుడు గ్రామసభ జరపడం ఎందుకని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభలను నిర్వహించాలని, సమస్యలు పరిష్కారం కాని ఈ సభల అవసరం ఏమిటని నిలదీశారు.
- గట్టులో గ్రామసభను అడ్డుకున్న మాజీ ఎంపీటీసీ
- పథకాలు అమలు కావడం లేదని అధికారులను నిలదీసిన ప్రజలు
గట్టు/ధరూరు, ఏప్రిల్ 2 : మండలంలోని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు గురువారం జరిగాయి. గట్టులో గ్రామసభ జరుగకుండా మాజీ ఎంపీటీసీ అడ్డుకున్నారు. సమస్యలు అనేకం ఉన్నాయని, దానికి సంబంధించిన అధికారులెవరూ గ్రామసభలో అందుబాటులో లేరని, అలాంటప్పుడు గ్రామసభ జరపడం ఎందుకని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభలను నిర్వహించాలని, సమస్యలు పరిష్కారం కాని ఈ సభల అవసరం ఏమిటని నిలదీశారు. దీంతో అధికారులు చేసేదిలేక గంటసేపు గడిపారు. అనంతరం బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి అక్బర్‌పాషా, ఎంపీడీవో చెన్నయ్య సర్దిచెప్పి సమావేశం కొ నసాగేటట్లు చేశారు. ధరూర్ మండలం నె ట్టెంపాడులో జరిగిన గ్రామసభలో ఎన్ హె చ్‌పీఎస్ మండల అధ్యక్షుడు గోవిందు ఆ ధ్వర్యంలో ప్రజలు గ్రామంలో నెలకొన్న స మస్యలపై సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ని నిలదీశారు. అదే విధంగా ఇందిరమ్మ ఇం డ్లు అర్హులకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామసభలో తిరగబడిన ప్రజలు
అచ్చంపేటటౌన్, ఏప్రిల్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమంలో ప్రజలు తిరగబడిన ఘటన అచ్చంపేట పట్టణంలో చోటుచేసుకున్నది. గురువారం అచ్చంపేట పట్టణంలోని 15వ వార్డులో మైనార్టీ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన మహిళలు నిలదీశారు. ఇందిరమ్మ ఇల్లు పేరుతో రూ.5 లక్షలు ఇచ్చానని చెబుతున్నారు ఎవరికిచ్చారు ఎప్పుడిచ్చారని, దానిని నిరూపించాలని నిలదీశారు. చాలా మందికి ఇచ్చినట్టే ఇచ్చి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్న పథకాలు ఏవీ తమకు అందడం లేదని సమావేశానికి హాజరైన ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులను నిలదీశారు. అర్హులైన వారికి ఎవరికీ ఇం దిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన వ్యక్తం చేశా రు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని వార్డు కౌన్సిలర్ మనోహర్ ప్రసాద్ ఆక్షేపించారు. ప్రజలను మోసం చేసేందుకు ప్రజా పాలన సభలను నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీరును ఎండగడుతూ సభ నుంచి ఆయన వాకౌట్ చేశారు.
దాసరిపల్లిలో నిలదీత..
మూసాపేట, ఏప్రిల్ 2 : మండలంలోని దాసరిపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో అధికారులను ప్రజలు నిలదీశారు. గ్రా మసభ ప్రారంభం అయిన తర్వాత ప్రభు త్వ పథకాల అమలు విషయంపై ఏజెండా చదువుతుండగా పథకాలన్నీ పూర్తిస్థాయిలో అమ లు కావడం లేదని, అమలు అవుతున్నట్లు ఎలా చెప్తారని కొంత మంది నిలదీశారు. తమకు డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని, మరొకరు పింఛన్ రాలేదని, రుణమాఫీ కాలేదని ఇలా పలువురు వారి సమస్యలను తెలియజేశారు. ఆ సమయంలో అధికార పార్టీ నాయకులు కలుగజేసుకోవడంతో మా టామాటా పెరిగి కొంత సేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

