IPL 2025 : పాలబుగ్గల పిల్లాడిని అనామకుడు అనుకుంటే హడలెత్తించాడు. పద్నాలుగేళ్ల వయసులోనే రికార్డు సెంచరీతో చరిత్ర పుటల్లో తన పేరు రాసుకున్నాడు. అతడే వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi). ఐపీఎల్ 18వ సీజన్లో 265.78 స్ట్రయిక్ రేటుతో శతకం బాది ‘టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యాడీ కుర్రాడు. తన పవర్ స్ట్రోక్‌తో విధ్వంసక శతకం బాదిన వైభవ్.. తాను ‘బేబీ బాయ్ కాదని బీభత్సానికి కేరాఫ్’ అని ప్రపంచానికి చాటాడు. జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై వైభవ్ ఊచకోత చూసినవాళ్లంతా ముక్తకంఠంతో ఇప్పుడిదే మాట అంటున్నారు.
టీమిండియా దిగ్గజం రవిశాస్త్రి(Ravi Shastri) భవిష్యత్‌లో భారత జట్టుకు ఆడే క్రికెటర్లలో వైభవ్ కచ్చితంగా ఉంటాడని చెప్పేశాడు. ఇక ఎంఎస్ ధోనీ(MS Dhoni) అయితే… ఈ పిల్లాడు చాలా అనుభవజ్ఞుడిలా ఆడుతున్నాడు. అతడికి ఎంతో భవిష్యత్ ఉందని తమతో చెప్పాడని రాజస్థాన్ జట్టు మేనేజర్ రోమి భిందెర్ తెలిపాడు.
What were you doing at 14?!! This kid is taking on the best bowlers in the world without blinking an eyelid! Vaibhav Suryavanshi — remember the name! Playing with a fearless attitude 🔥 Proud to see the next generation shine! #VaibhavSuryavanshi #GTvsRR
— Yuvraj Singh (@YUVSTRONG12) April 28, 2025
మాజీ ఆటగాళ్లు అయితే.. ‘మీరు 14 ఏళ్ల వయసులో ఏం చేసేవాళ్లు.. వైభవ్‌ను చూడండి అతడు రికార్డులు బద్ధలు కొడుతున్నాడు’ అని ఈ యువకెరటం ప్రతిభను ఆకాశానికెత్తేస్తున్నారు. ఓపెనర్‌గా ఈ బిహార్ కుర్రాడు రాణిస్తుండడంతో రాజస్థాన్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. కెప్టెన్ సంజూను ఏ స్థానంలో ఆడించాలి? ఎవరిని బెంచ్‌పై కూర్చోబెట్టాలి అనేది? ద్రవిడ్ బృందానికి తోచడం లేదు.
Awards collection from last night.🏆 pic.twitter.com/y4jhE6vxNq
— Vaibhav Suryavanshi 🧢 (@VaibhavSV12) April 29, 2025
సంజూ శాంసన్ గాయపడడంతో లక్నోసూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చాడు. 14 ఏళ్ల అతడిని చూసి.. ఈ పిల్లాడు ఏం ఆడతాడులే అనుకున్నారు లక్నో బౌలర్లు. అయితే.. వాళ్ల ఆలోచన తప్పని నిరూపిస్తూ శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే లాంగాఫ్‌లో స్టాండ్స్‌లోకి పంపాడు. అంతే.. స్టేడియంలోని అభిమానులు, కామెంటేటర్లు ‘వాట్ ఏ షాట్’ అని విజిల్స్ వేశారు. ఆ తర్వాత అవేశ్ ఖాన్ ఓవర్లోనూ దంచేసిన వైభవ్.. 35 పరుగుల వద్ద స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. లేదంటే ఆ మ్యాచ్‌లోనే ఈ చిచ్చరపిడుగు అర్థ శతకం బాదేవాడే.
One of the greatest knocks in IPL history – and he’s only 14! 😱
He’s almost hit more sixes than his age! MORE: https://t.co/IJSZGDrhaJ pic.twitter.com/L7gXI7zDqp
— cricket.com.au (@cricketcomau) April 28, 2025
తొలి మ్యాచ్‌లో చేజారిన హాఫ్ సెంచరీని గుజరాత్ టైటాన్స్‌పై సాధించాడు వైభవ్. సిరాజ్‌కు సిక్సర్‌తో స్వాగతం పలికిన అతడు.. ఆ తర్వాత కూడా సిక్సర్లు, ఫోర్లతో విజృంభించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ధాటికి 32 ఏళ్ల ఇషాంత్ శర్మ 6, 6, 4 ,6, 4 సమర్పించుకున్నాడు. 18వ ఎడిషన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న కరీం జన్నత్ ఓవర్లో వైభవ్.. సిక్సర్లతో హెరెత్తించి ఏకంగా 30 రన్స్ పిండుకున్నాడు. అతడు రెచ్చిపోయి ఆడుతుంటే అభిమానులే కాదు బంతి కూడా బౌండరీ దాటేస్తూ మురిసిపోయిందనుకో.
17 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన ఈ కుర్రాడు… తన తొలి అర్ధ శతకాన్నే వందగా మలిచాడు. 35 బంతుల్లోనే సెంచరీకి చేరువై ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా రికార్డు సృష్టించాడు వైభవ్. ఇది అరంభం మాత్రమేనని.. తన బ్యాట్ నుంచి మరిన్ని మెరుపు శతకాలు జాలువారతాయనే భరోసా కల్పిస్తున్న వైభవ్.. ఆడితే చూసి తరించేందుకు కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.
What Legends like Virat, Rohit, Sachin, Buttler, Warner and mony more haven’t done in IPL, this 14 year kid #vaibhavsuryavanshi has done it 👏🏻
~ 2nd Fastest 💯 in IPL
~ Fastest 50 of IPL 2025 (17 balls)
~ IPL 💯 at the age of just 14That’s Insane ❤️🔥pic.twitter.com/WSKYqPCDAK
— Richard Kettleborough (@RichKettle07) April 28, 2025