సికింద్రాబాద్ : సికింద్రాబాద్లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఓ లాడ్జిలో బాలికతో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరి వయస్సు 19 ఏళ్ల చొప్పున, మరో ఇద్దరి వయస్సు 17 ఏళ్ల చొప్పున ఉందని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బాలిక ఈ నెల 4వ తేదీన అదృశ్యమైంది. దాంతో తమ కూతురు (13) కనిపించడం లేదని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలిక సికింద్రాబాద్ పరిధిలోని ఒక లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు.
బాలిక ఈ నెల 8న సికింద్రాబాద్ బస్టాండ్ పరిసరాల్లో సంచరిస్తుండగా.. నిందితులు ఆమెకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ విషయం వెల్లడైంది. నిందితులపై పోక్సో కేసు నమోదుచేసినట్లు పోలీసుల తెలిపారు.