– నల్లగొండ ఆర్టీసీ డిపో జేఏసీ
నల్లగొండ సిటీ, ఏప్రిల్ 01 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ నల్లగొండ డిపో జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు, టీజీఎస్ఆర్టీసీ-జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ డిపో జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు బ్లాక్ డే లో భాగంగా నల్ల బ్యాడ్జీలు, బ్లాక్ డే బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎన్ఆర్సీ రాజు, డిపో జేఏసీ నాయకులు వీఎస్ రెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ అధ్యక్షుడు కందుల నర్సింహ, రీజియన్ సహాయ కార్యదర్శి కె.శ్యామ్ సుందర్, డిపో అధ్యక్షుడు నర్సింహయ్య, కార్మికులు బీఆర్ లింగం, కె.జయరాజ్, కెఎల్ రెడ్డి, కె.కుమార్, టీఎస్ రెడ్డి, కేఎస్ రెడ్డి పాల్గొన్నారు.

‘నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి’