Priyanka Chopra | స్వర్ణ దేవాలయంలో ప్రియాంక చోప్రా సేవలు.. గిన్నెలు కడుగుతూ కనిపించిన గ్లోబల్ స్టార్
Priyanka Chopra | గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి భారతీయ సంస్కృతిపట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంది. హాలీవుడ్లో స్టార్డమ్ సంపాదించినప్పటికీ, తన మూలాలను మరచిపోలేదని నిరూపిస్తూ ఆమె తాజాగా పంజాబ్లోని స్వర్ణ దేవాలయంను దర్శించుకుంది. మంగళవారం (మార్చి 31) అమృత్సర్లోని ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించిన ప్రియాంక, సాధారణ భక్తురాలిలా సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లింది.
Priyanka Chopra | గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి భారతీయ సంస్కృతిపట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంది. హాలీవుడ్లో స్టార్డమ్ సంపాదించినప్పటికీ, తన మూలాలను మరచిపోలేదని నిరూపిస్తూ ఆమె తాజాగా పంజాబ్లోని స్వర్ణ దేవాలయంను దర్శించుకుంది. మంగళవారం (మార్చి 31) అమృత్సర్లోని ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించిన ప్రియాంక, సాధారణ భక్తురాలిలా సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లింది.. తలపై దుపట్టా కప్పుకుని ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఆలయంలో ఉన్న భక్తులు, సిబ్బందితో ఎంతో మర్యాదగా మెలుగుతూ పలువురికి సెల్ఫీలు కూడా ఇచ్చారు.
అయితే, ఈ సందర్శనలో అందరినీ ఆకట్టుకున్న అంశం ఆమె చేసిన సేవ. ఆలయంలో భక్తులు వాడిన పాత్రలను మహిళలతో కలిసి ప్రియాంక స్వయంగా కడిగారు. స్టార్డమ్ ఉన్నప్పటికీ ఎలాంటి అహంకారం లేకుండా ఇలా సేవలో పాల్గొనడం నెటిజన్లను మెప్పిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంక వినయాన్ని చూసి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఎంత పెద్ద స్టార్ అయినా ఆమె విలువలు మర్చిపోలేదు”, “ఇదే నిజమైన గ్రేట్నెస్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రియాంక చోప్రా ప్రస్తుతం అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అలాగే మహేష్ బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. గ్లోబల్ స్టార్గా ఎంత ఎదిగినా, వినయం, సేవ భావం ఎంత ముఖ్యమో ప్రియాంక చోప్రా తన ప్రవర్తనతో మరోసారి చాటిచెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

