హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : తిరుమల లడ్డూ కల్తీ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది. ఆదివారం ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం నలుగురిని అరెస్టు చే సింది. వారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ, పరాగ్ ఫుడ్స్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు. నిందితులను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.