నార్నూర్ : హైదరాబాదులోని బంజారా హిల్స్ బీఆర్ఎస్ భవన్లో ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ (Rathod Janardhan) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బలోపేతం కోసం కృషి చేయాలని కేటీఆర్ సూచించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి చైతన్య పరచాలని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను సైతం వివరించి అమలు చేయని విషయాన్ని కూడా ప్రజలకు స్పష్టం తెలియజేయాలని కోరారు. సాగునీరు, రైతు భరోసా, రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు ప్రజలకు ఎక్కడా కూడా అందడం లేదన్న విషయాన్ని వివరించాలన్నారు.