లింగాలఘనపురం, జూలై 3 : రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు అధైర్యపడొద్దని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. లింగాలఘనపురం మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఎల్ఏల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
బీఎల్ఏలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటు నమోదు చేయించాలన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండదండలు ఉంటాయని కేసీఆర్ వివరించారన్నారు. వారికి ఎలాంటి ఆపద వచ్చినా తాము వెన్నంటి ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామన్నారు. కార్యకర్తలే పార్టీకి పునాదులన్నారు. వారి కష్టానికి వెలకట్టలేమన్నారు. కార్యక్రమంలో నాయ కులు సేవెల్లిసంపత్, చౌదరపెల్లి శేఖర్, ఏదునూరి వీరన్న, ఉడుగుల భాగ్యలక్ష్మి , గండి యాద గిరి, బస్వగాని శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.