మహదేవపూర్/కాటారం/మల్హర్, జనవరి 4 : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని జాగృతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మహదేవపూర్, కాటారంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జీపీ ఎన్నికల్లో డబ్బులతో గెలుస్తామనుకున్నోళ్లకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. పదేండ్లు అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ. వందల కోట్ల మేర ఖర్చు చేశాడని, రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎంత ఖర్చు చేస్తాడో ఊహించు కోవాలన్నారు.
తనది ఓటు, పదవితో సంబంధం కాదని, ప్రజలతో పేగు బంధమేనని పేర్కొన్నారు. శ్రీధర్‌బాబు అరాచకాలను ఎండగట్టడంతో మనం విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. కొత్త సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉండి కూడా మొన్నటి ఎన్నికల్లో స్వగ్రామం ధన్వాడలో సర్పంచ్‌ను ఏకగ్రీవం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్ఆర్ఐలు స్వగ్రామానికి సేవ చేయాలనే మంత్రి, స్వగ్రామమైన ధన్వాడకు ఆయన కుటుంబం ఏం చేసిందని ప్రశ్నించారు.
పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు చేరువైతే రౌడీ అని తనపై ముద్ర వేశారన్నారు. తనను, తన కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నానన్నారు. ఇదే స్ఫూర్తితో గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన మంచిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్లకు నాయకత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు.
జడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్‌రావు, జోడు శ్రీనివాస్, సర్పంచ్‌లు నీర్ల ప్రభాక ర్, పేట లత, పంతకాని సడవలి, ఊర వెంకటేశ్వర్ రా వు, నరివెద్ది మాధవి, బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకే శ్, శ్రీపతిబాపు, కేదారి గీత, ఓడేటి స్వప్న, అన్నమనేని అరుణ, ఎండీ అలీం ఖాన్, సల్మాన్‌ఖాన్, అన్కారీ ప్రకా శ్, పెండ్యాల మనోహర్, తడకల రమేశ్, కలికోట దేవేందర్, బాపురావు, నాగుల లక్ష్మారెడ్డి, తోట జనార్దన్, జక్కు శ్రావణ్, వంగల రాజేంద్రాచారి, మానెం రాజబా పు, తదితరులు పాల్గొన్నారు. కాగా, మల్హర్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, మంథని మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బోయిని రాజన్నయాదవ్, విక్రమ్ యాదవ్, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, గొర్రె మల్లయ్యయాదవ్, పిట్టవేని ఐలికొమురు యాదవ్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.