హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు భూభారతి బ్రదర్స్. వారిద్దరిది భూ కబ్జా బంధం’ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, కిషన్‌రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో సైకో, శాడిజం, రౌడీ బద్రర్స్ అంటూ ఎవరైనా ఉన్నారం టే, అది సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌లే అని విమర్శించారు.
అందుకే ‘జూబ్లీహిల్స్‌లో తాను నవీన్‌యాదవ్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పిస్తా.. బీజేపీ తరఫున దీపక్‌రెడ్డికి నువు టిక్కెట్ ఇప్పించు’ అనే విధంగా వారిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింద ని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీదీ ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు. ఎల్కేజీ ఆర్ఎస్ఎస్, స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం మాత్రం కాంగ్రెస్‌లో చేస్తున్నాను.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పారని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఎనికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో ఉండి చిల్లర మాట లు మాట్లాడారని మండిపడ్డారు.
రేవంత్, కిషన్‌రెడ్డి బర్కత్‌పుర బ్రదర్స్
రేవంత్, కిషన్‌రెడ్డి బర్కత్‌పుర బ్రద ర్స్ అని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి ఇంట్లో తాను గతంలో పెయింట్ వేశానని రేవంత్ స్వయంగా చెప్పుకున్నారని తెలిపారు. కిషన్‌రెడ్డి పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లే వాడినని చెప్పారని.. గుర్తుచేశారు.
రెండేండ్లకు మైనార్టీలు గుర్తుకొచ్చారా?
అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌కు మైనార్టీలు గుర్తుకొచ్చారా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కొందరు ప్రభుత్వాధికారులు, కాంగ్రెస్ సర్కార్‌కు పని మనుషుల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీ విజల్ యాప్ పనిచేయడమే లేదని, అందులో ఫిర్యాదు చేస్తే తీసుకోవడమే లేదని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్కు భారీ మెజార్టీ తథ్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కి లక్ష ఓట్ల భారీ మెజార్టీ వస్తుందని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగి తే బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.
మద్యం, నగదు పంచుతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ నాయకులు మద్యం, చీర లు, నగదును యథేచ్ఛగా ఓటర్లకు పంపి ణీ చేస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలో జరుగుతున్నది ఒక రౌడీ, ఒక లేడీ మధ్య యుద్ధమని జీవన్‌రెడ్డి అభివర్ణించారు. కారుకు, బుల్డోజర్ మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై ఈసీ చర్యలేవి?
ఓటర్లకు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా డబ్బు పంచితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, కాంగ్రెస్తోఎన్నికల కమిషన్ కుమ్మక్కైందా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి హైదరాబాద్ వదిలి పారిపోతడని పేర్కొన్నారు. దొంగ హామీలు, దొంగ జీవోలు ఇచ్చుడే తప్ప, చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఏమైనా, ఎంపిక మాత్రం కేసీఆరే అని చెప్పారు. రేవంత్‌రెడ్డి నేమ్ ఛేంజర్ అయితే, కేసీఆర్ గేమ్ ఛేంజర్ అని ఆయన స్పష్టంచేశారు.