వెల్దండ, ఏప్రిల్ 10 : రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధైరపడొద్దని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కార్యకర్తలకు భరోసా నింపారు. శుక్రవారం మండల బీఆర్ఎస్ నూతన కమిటీతోపాటు 200మంది కార్యకర్తలు హైదరా బాద్‌లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ముందు గా వారిని పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన కమిటీని వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో అరాచక పా లన నడుస్తుందని అడుగడుగున కాంగ్రెస్‌ను నిలదీయాల్సిన సమయం అసన్నమైందన్నా రు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా యూవత్ తెలంగాణ ప్రజలను మోసగించిందన్నారు.
రాష్ట్రంలో పోలీసులను ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్దే అధికారమని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పుట్టా రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్, జోగయ్య, నిరంజన్, నర్సింహ, ఆనంద్, కొండల్, హ న్మంతు, లింగం, రమేశ్, అశోక్, మైసయ్య, వెంకటయ్య, వెంకట్ , సర్పంచు లు,మాజీ సర్పంచులు తదితరులు ఉన్నారు.