ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన మొహరం( Muharram ) దశమి ఉత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డప్పు చప్పులతో ఊరేగింపుగా బయలుదేరి పూలు, చక్కెర ఫాతిహా అందజేశారు. హసన్, హుస్సేన్ లకు దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్యేను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.
భక్తుల సౌకర్యార్థం పీర్ల మసీదు పునర్నిర్మాణం చిట్టెం హయాంలో జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, యువజన అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు వడ్ల మోనప్ప, శివారెడ్డి, గంగాధర్ చారి, తరుణ్ రెడ్డి, ఓబేదుర్ రహిమాన్, హోటల్ ఖాలిక్, చంద్రశేఖర్ గౌడ్, ఆసిఫ్, రహీం, వడ్డే పెద్దోడు, నాగేష్ పాల్గొన్నారు.