Warangal | ప్రేమ జంటను బెదిరించి దోపిడీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్
ఏకాంతంగా ఉన్న లవర్సే(Lovers) వారి టార్గెట్. ఎక్కడైనా ఒంటరిగా ప్రేమ జంట కనిపిస్తే చాలు దోపిడీలకు(Robbing) పాల్పడుతుంటారు.
హైదరాబాద్ : ఏకాంతంగా ఉన్న లవర్సే(Lovers) వారి టార్గెట్. ఎక్కడైనా ఒంటరిగా ప్రేమ జంట కనిపిస్తే చాలు దోపిడీలకు(Robbing) పాల్పడుతుంటారు. ప్రేమ జంటలను బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ (Hanumakonda)జిల్లా కాజీపేటకు చెందిన బౌరి పవన్ సింగ్, రవీందర్ సింగ్, సికిందర్ సింగ్ ముగ్గురు కలిసి ఈ నెల 7న ఉర్సు గుట్ట ప్రాంతంలో ఓ యువతి, యువకుడు బైక్పై వెళ్లడాన్ని గమనించారు. వారు ఏకాంతంగా గడుపుతుండా సెల్ఫోన్లో ఫొటోలు తీసి డబ్బులు ఇవ్వకుంటే మీ తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించారు.
తమ దగ్గర డబ్బులు లేవని బతిమాలిన వినకుండా సదరు జంటపై దాడికి పాల్పడి చేతికి ఉన్న బంగారు ఉంగరాలు, గొలుసులు లాక్కున్నారు. యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. కాగా, వారి వద్ద దోచుకున్న సొత్తును విక్రయించేందుకు వరంగల్ వెళ్లగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు ఉంగరం, గొలుసులు, మూడు సెల్ఫోన్స్, బైక్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ స్వామి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

