పోలీసుల నుంచి తప్పించుకునేందకు అండర్ పాస్‌లోకి దూకి.. కాళ్లు, చేతులు విరగొట్టుకున్న దొంగలు
ఓ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ సి.ఎల్. జైన్ నివాసంలో దోపిడీకి పాల్పడిన నలుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఢిల్లీ : గురుగ్రామ్‌లోని ఓ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ సి.ఎల్. జైన్ నివాసంలో దోపిడీకి పాల్పడిన నలుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులను పట్టుకునే క్రమంలో నాటకీయ పరిణా మాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దుండగులు ఓ అండర్ పాస్‌లోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దోపిడీకి పాల్పడిన నిందితులు ప్రస్తుతం ఢిల్లీలోని సంగమ్ విహార్, వజీరాబాద్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ద్వారకా రోడ్డులోని బజ్ఘేరా అండర్‌పాస్ సమీపంలో వారిని అరెస్టు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్ టీం వెళ్లగా వారు అండర్‌పాస్‌లోకి దూకారని, ఈ ఘటనలో ఖైరుల్ అలియాస్ అర్మాన్‌కు రెండు కాళ్లు విరగగా, హిలాల్, మామన్లకు చెరో కాలు విరిగింది. మామో ఖాన్‌కు చేయి విరిగింది.నలుగురిని దవాఖానలో చేర్చారమని పోలీసులు తెలిపారు.
అలాగే గురుగ్రామ్, ఢిల్లీ ప్రాంతాలలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడిన ముఠాతో వీరికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హాస్పిటల్ నుంచి వారు డిశ్చార్జి అయ్యాక కోర్టులో ప్రవేశపెడుతామని పోలీసులు తెలిపారు. కాగా, గురుగ్రామ్‌లోని సెక్టార్ 23లో రిటైర్డ్ ఆర్మీ కల్నల్ సి.ఎల్. జైన్ ఇంట్లో జూన్ 4, 2026 తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. నలుగురు సాయుధ దుండగులు కిటికీ గ్రిల్స్ కత్తిరించి ఇంట్లోకి ప్రవేశించి, కుటుంబాన్ని బందీలుగా చేసి రూ. 15 లక్షల విలువైన నగదు, బంగారు, వజ్రాభరణాలను దొంగిలించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

